- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీఎం వ్యాన్ బోల్తా: ఇద్దరి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్‌నగర్: రాజాపూర్ మండల కేంద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్‌కు గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ చంద్రశేఖర్, రామచంద్రగౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎంలో తరలిస్తున్న గొర్రెలలో 20 మృతి చెందాయి. ఈ క్రమంలో డీసీఎంను తప్పించబోయి లారీ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో జాతీయ రహదారిపై […]</p>
దిశ, మహబూబ్‌నగర్: రాజాపూర్ మండల కేంద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్‌కు గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ చంద్రశేఖర్, రామచంద్రగౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎంలో తరలిస్తున్న గొర్రెలలో 20 మృతి చెందాయి. ఈ క్రమంలో డీసీఎంను తప్పించబోయి లారీ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి మిగిలిన గొర్రెలను వేరే వాహనంలో తరలించారు. మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






