- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం..
by Batti.Sumithra |
<p>దిశ, చేవెళ్ల : షాబాద్ నుంచి చేవెళ్ల వైపు వస్తున్న బైక్‌ను వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. చేవెళ్ళ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన కావలి గణేష్, కావలి నరేష్‌లు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ బైక్‌పై షాబాద్ […]</p>

X
దిశ, చేవెళ్ల : షాబాద్ నుంచి చేవెళ్ల వైపు వస్తున్న బైక్‌ను వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. చేవెళ్ళ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన కావలి గణేష్, కావలి నరేష్‌లు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు.
వీరిద్దరూ బైక్‌పై షాబాద్ వెళ్లి చేవెళ్ల వైపు వస్తుండగా విద్యా వికాస్ కళాశాల వద్దకు రాగానే వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






