ధోనికి ఆ సత్తా ఉంది.. పేసర్ డెయిల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్స్

by  |
ధోనికి ఆ సత్తా ఉంది.. పేసర్ డెయిల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీం ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే రథసారధి మహేంద్ర సింగ్ ధోని పై సౌత్ ఆఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోనికి ఫామ్ లేకున్నా తన టీంను గెలిపించుకుంటాడని, అంతటి సామర్థ్యం అతనిలో ఉందన్నాడు. ఈరోజు సాయంత్రం CSK వర్సెస్ KKR మధ్య ఫైనల్ మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే.

ధోని లాంటి వ్యక్తులకు క్లాస్ అనేది పర్మినెంట్ అని, అతను ఫామ్‌లో ఉన్నా లేకున్నా కెప్టెన్‌గా తన టీమ్‌ను గెలిపించుకుంటాడని కామెంట్ చేశాడు. అయితే, కోల్ కత్తా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం ఇంకా కొంచెం కష్టపడుతున్నాడని.. ఈ రెండు జట్ల మధ్య ఉన్నా తేడా అదే అని వెల్లడించాడు. అయితే, ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం గెలుపు అవకాశాలు ఎక్కువగా చెన్నై జట్టుకే ఉన్నాయని స్టెయిన్ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed