- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టభద్రులను ప్రశ్నించిన దాసోజు శ్రవణ్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సోషల్‌మీడియా సెటైర్లు ఎక్కువవుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. పట్టభద్రులు అమ్ముడుపోతారా? అని ప్రశ్నించారు. ‘నిగ్గుదీసి అడుగు సిగ్గులేని జనాన్ని’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటను ట్వీట్ చేశారు. ‘శాసనాలు చేసేటోడే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే, పాఠాలు చెప్పే పంతుళ్లు మందులకు, విందులకు లొంగిపోతుంటే, పట్టాలు […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సోషల్‌మీడియా సెటైర్లు ఎక్కువవుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. పట్టభద్రులు అమ్ముడుపోతారా? అని ప్రశ్నించారు. ‘నిగ్గుదీసి అడుగు సిగ్గులేని జనాన్ని’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటను ట్వీట్ చేశారు. ‘శాసనాలు చేసేటోడే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే, పాఠాలు చెప్పే పంతుళ్లు మందులకు, విందులకు లొంగిపోతుంటే, పట్టాలు పట్టుకున్న పట్టభద్రుడు పైసలకు అమ్ముడుపోతుంటే, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం కాదా? అజ్ఞానులు విజేతలైతే విజ్ఞానం సమాధి కాదా? ధర్మం ఓటమి చెందితే, అధర్మం రాజ్యమేలదా?’ అంటూ సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కొంతమంది విమర్శల్లో మరింత ఘాటు పెంచారు.






