మారథాన్‌లో పాల్గొన్న బాతు.. వైరల్‌గా మారిన వీడియో!

by  |
duck
X

దిశ, ఫీచర్స్ : సుదీర్ఘంగా సాగే పరుగు పందాలనే ‘మారథాన్’ అంటారని తెలిసిందే. పరుగెత్తుతూ లేదా వేగంగా నడుస్తూ ఈ రేస్‌లను పూర్తి చేస్తుంటారు. ఇక బిగ్ మారథాన్స్‌లో అయితే పదివేల మందికి పైగా పాల్గొంటారు. ఇక ప్రతీ ఏట ప్రపంచవ్యాప్తంగా 800 కంటే ఎక్కువ మారథాన్స్ జరుగుతున్నాయని సమాచారం. అంటే ఏదో ఒక రోజు, ఎక్కడో చోట మారథాన్స్ జరుగుతూనే ఉంటాయన్నమాట. తాజాగా న్యూయార్క్‌లో మారథాన్‌ జరుగుతుండగా.. ఒక బాతు అందరి దృష్టిని ఆకర్షించింది. రన్నర్స్‌తో తాను కూడా పోటీ పడతాను అన్నట్లుగా వారితో నడక సాగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘వీకెండ్ మారథాన్‌ను ఓ డక్‌ నడిపింది. అవును, మీరు చదివింది నిజమే’ అంటూ అథ్లెటిక్ వీక్లీ.. మారథాన్‌లో బాతు పాల్గొన్న వీడియోను షేర్ చేసింది. అంతేకాదు ఆ బాతు ఎరుపు రంగు ‘డక్ షూస్’ ధరించడం అందరినీ ఆకర్షించింది. ఇక ఈ బాతుకు ‘సెడక్టివ్’ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉండటం విశేషం. ఈ మేరకు ‘న్యూ్యార్క్ మారథాన్‌లో పరుగెత్తాను!! వచ్చే ఏడాది మరింత మెరుగుపడతాను! నన్ను ఉత్సాహపరిచిన మానవులందరికీ ధన్యవాదాలు!’ అంటూ సెడక్టివ్ ఇన్‌స్టా పేజీలో ఉంది. ఏదేమైనా ఈ డక్ వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

https://www.instagram.com/p/CWBG8yylHaX/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again


Next Story

Most Viewed