డ్యాన్స్ నేర్పిస్తానని బాలికను గదిలోకి తీసుకెళ్లి..

by  |
డ్యాన్స్ నేర్పిస్తానని బాలికను గదిలోకి తీసుకెళ్లి..
X

దిశ, కంటోన్మెంట్ : డ్యాన్స్ నేర్పిస్తానని బాలికను గదిలోకి తీసుకెళ్లిన డ్యాన్స్ మాస్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బోయిన్ పల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్ స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. తిరుమలగిరి, దుర్గ విహార్ కాలనీకి చెందిన బాలిక(16) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే జనవరి 4న సిక్ రోడ్డులోని జుపిటర్ కాలనీ వద్ద ఉన్న అర్బన్ డ్యాన్స్ వరల్డ్‌లో చేరింది. డ్యాన్స్ మాస్టర్, నిర్వహకుడు సుదర్శన్ ఆమెను ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు కోచింగ్ తీసుకోవాలని సూచించాడు.

ఈ మేరకు బాలిక ప్రతిరోజు డ్యాన్స్ శిక్షణ తీసుకుంటూ వచ్చింది. అయితే, మార్చి 21వ తేదీన సుదర్శన్ బాలికకు ఫోన్ చేసి, నడుము భాగంలో ఉన్న కొవ్వు(ఫ్యాట్)ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నందున, ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో తరగతులకు హాజరు కావాలని చెప్పాడు. దీంతో బాలిక గత నెల 26వ తేదీ నుంచి ఉదయం వేళల్లో తరగతులకు హాజరవుతోంది. 31న బాధితురాలు ఉదయం డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లగా, అప్పటికే మరో కోచ్ రతన్ వద్ద కొంతమంది శిక్షణ పొందుతున్నారు. దీంతో సుదర్శన్ సదరు బాలికను మరో గదిలోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే అతని చేష్టలను గమనించిన బాలిక సుదర్శన్‌ను పక్కకు తోసేసి అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఏప్రిల్ 1వ తేదీన కుటుంబ సభ్యులకు చెప్పగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుదర్శన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


Next Story

Most Viewed