- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఎస్‌ఐపై చర్యలు తీసుకోండి.. ఎస్పీ ఆఫీసులో దళితుల ధర్నా
by Shyam |
<p>దిశ, గద్వాల: దళితులపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో అకారణంగా దాడి చేశారంటూ.. గత నెల రోజులుగా దళిత సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌ఐ శ్రీకాంత్ దాడి చేస్తే.. కనీసం చర్యలు తీసుకోలేదంటూ జమ్మిచేడు గ్రామానికి చెందిన ఆనంద్ కుటుంబ సభ్యులు నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట భైఠాయించారు. తక్షణమే సదరు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలంటూ పురుగుల మందు తాగేందుకు యత్నించారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ.. దళితులపై […]</p>

X
దిశ, గద్వాల: దళితులపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో అకారణంగా దాడి చేశారంటూ.. గత నెల రోజులుగా దళిత సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌ఐ శ్రీకాంత్ దాడి చేస్తే.. కనీసం చర్యలు తీసుకోలేదంటూ జమ్మిచేడు గ్రామానికి చెందిన ఆనంద్ కుటుంబ సభ్యులు నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట భైఠాయించారు. తక్షణమే సదరు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలంటూ పురుగుల మందు తాగేందుకు యత్నించారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ.. దళితులపై దాడి చేసినా.. నేటి వరకు చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు. ఉన్నతాధికారులు సైతం కాలయాపన చేస్తున్నారని.. తక్షణమే ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






