- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూడూరులో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ
<p>దిశ, గూడూరు: గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి హాజరయ్యారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి డప్పు చప్పుళ్ళతో భారీ ర్యాలీగా గాంధీ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత గిరిజన వర్గాలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు […]</p>

దిశ, గూడూరు: గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి హాజరయ్యారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి డప్పు చప్పుళ్ళతో భారీ ర్యాలీగా గాంధీ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత గిరిజన వర్గాలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దళిత గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో కేటాయించాలని, దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, దళిత బంధు గిరిజనులకు కూడా అమలు చేయాలని కోరారుె. మహబూబాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మహబూబాబాద్ శాసనసభ్యుడు శంకర్ నాయక్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






