సిరిసిల్లలో సంచలనం.. కేటీఆర్ రాజీనామా చేయాలంటూ నిరసన.(వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2025-10-08 16:01:05  IST  )

<p>దిశ, సిరిసిల్ల : దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో దళితులు నిరసనకు దిగారు. దళిత సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికలు ఉన్నచోటే హామీలు ఇస్తూ, నిధులు ధారపోస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. మొదటి విడతలో దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించకపోతే దళితుల […]</p>

సిరిసిల్లలో సంచలనం.. కేటీఆర్ రాజీనామా చేయాలంటూ నిరసన.(వీడియో)
X

దిశ, సిరిసిల్ల : దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో దళితులు నిరసనకు దిగారు. దళిత సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికలు ఉన్నచోటే హామీలు ఇస్తూ, నిధులు ధారపోస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

మొదటి విడతలో దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించకపోతే దళితుల ఓట్లను దండుకునేందుకే ఈ పథకం చేపట్టినట్లు అవుతుందని ఆరోపించారు. హుజురాబాద్‌లో మాత్రమే దళిత బంధును అమలు చేస్తే స్థానిక మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు దళిత బంధు పథకాన్ని సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా అమలు చేస్తారన్నారు.

Click For Video..

Next Story