- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. హుజురాబాద్‌లో దళిత బంధు సర్వే స్టార్ట్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్‌లో శుక్రవారం అధికారులు సర్వే ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను జిల్లా కలెక్టర్ కర్ణన్ జిల్లా యంత్రాంగానికి అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 200 మంది వివిధ శాఖల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం 48 అంశాలపై దళిత కుటుంబాల నుంచి సేకరించాల్సి ఉంది. ఐదు రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకర్లు […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజురాబాద్‌లో శుక్రవారం అధికారులు సర్వే ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను జిల్లా కలెక్టర్ కర్ణన్ జిల్లా యంత్రాంగానికి అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 200 మంది వివిధ శాఖల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం 48 అంశాలపై దళిత కుటుంబాల నుంచి సేకరించాల్సి ఉంది. ఐదు రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
బ్యాంకర్లు సర్వేలో ఉంటారు
దళిత బంధు సర్వేలో రెవెన్యూ అధికారులకు తోడుగా బ్యాంకు అధికారులు కూడా పాల్గొంటారని హుజురాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు సపోర్టింగ్ ఆఫీసర్లతో పాటు బ్యాంకు అధికారులు కూడా సర్వేకు హాజరవుతున్నారని వివరించారు. దళితులు సర్వే ద్వారా వివరించే అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఏ స్కీం వర్తిస్తుంది.. వాటి వల్ల వారి కుటుంబాలకు కలిగే ఆదాయం తదితర వివరాలను కూడా తెలియజేస్తామని చెప్పారు. ఈ పైలెట్ ప్రాజెక్టు సర్వేను దళితులు, అధికారులు విజయవంతం చేయాలని ఆర్డీఓ కోరారు. -ఆర్డీవో రవీందర్ రెడ్డి






