తప్పిపోయిన బాలుడిని కాపాడిన డయల్ 100..

by  |
తప్పిపోయిన బాలుడిని కాపాడిన డయల్ 100..
X

దిశ, మంచిర్యాల : డయల్ 100కు కాల్ రావడంతో బ్లూ కోల్ట్స్ పోలీసులు వెంటనే అప్రమత్తమై తప్పిపోయిన బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకివెళితే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన మహిళ కుమారుడు ఆడుకుంటూ వెళ్లి కనపించకుండా పోయాడు. కుటుంబీకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. మొత్తం వెతికి నిరాశ చెందిన కుటుంబసభ్యులు డయల్ 100కు కాల్ చేశారు. వెంటనే పట్టణ సీఐ నారాయణ నాయక్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు బ్లూకోల్ట్స్ సిబ్బంది ఉస్మాన్, తిరుపతి, ఔట్ పోస్ట్ కానిస్టేబుల్ శ్రీధర్‌తో కలిసి బాలుడిని వెతికి పట్టుకుని అప్పగించారు. డయల్ 100కు కాల్ చేయగానే వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి బాబు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story