స్టార్ హీరో జీవితాన్ని మార్చిన బస్ డ్రైవర్.. ఆ కథ చెప్తూ ఎమోషనల్..

by  |
స్టార్ హీరో జీవితాన్ని మార్చిన బస్ డ్రైవర్.. ఆ కథ చెప్తూ ఎమోషనల్..
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను ఈ పురస్కారం అందుకోగా.. ఈ సందర్భంగా తను జీవితంలో నటుడిగా ఎదిగేందుకు, ప్రపంచఖ్యాతి సంపాదించేందుకు కారణమైన ముగ్గురిని తలుచుకున్నారు. గురువు బాలచందర్, సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్‌, కర్ణాటక బస్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్- స్నేహితుడు రాజ్ బహదూర్‌లకు ఈ అవార్డును అంకితమిచ్చిన ఆయన.. తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహించింది ఫ్రెండ్ అని వివరించాడు. బ్రదర్ సత్యనారాయణ ఆధ్యాత్మిక చింతన కలిగేలా చేస్తే… బాలచందర్‌ గారు నటుడిగా ఎదిగేందుకు పూర్తి మద్దతునిచ్చారని తెలిపారు. ఇక తమిళ ప్రజలు లేకుంటే తాను లేనన్న తలైవా.. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కోస్టార్స్, మీడియా, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

https://twitter.com/RajiniFoLLowers/status/1452535704945262597?s=20

Next Story

Most Viewed