టీచర్ కటౌట్‌తో ఇంట్లోనే క్లాస్‌రూమ్..

by  |
టీచర్ కటౌట్‌తో ఇంట్లోనే క్లాస్‌రూమ్..
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా పాండమిక్ సిచ్యువేషన్‌లో విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియాలోనే కాదు, వివిధ దేశాల్లోనూ డిజిటల్ తరగతులు కొనసాగుతున్నాయి. టీచర్స్ కూడా తమ ఇన్నోవేటివ్ ఐడియాలతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. కొంతమంది ‘వర్చువల్ రియాలిటీ’ సాంకేతికతను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇన్నోవేటివ్ థాట్స్‌తో తమ పిల్లలకు చదువు చెబుతున్నారు.

ఉద్యోగులకు.. ఎలాగైతే ఆఫీసులో ఉన్న వాతావరణం ఇంట్లో ఉండదో, అలాగే విద్యార్థులకు కూడా స్కూల్‌లో ఉన్న సెటప్ ఇంట్లో కుదరదు. ఈ నేపథ్యంలోనే ఓ తండ్రి వినూత్నమైన ఆలోచనతో తన కూతురిని ఫిదా చేయడమే కాకుండా.. నెటిజన్ల అభినందనలు అందుకుంటున్నాడు. తన గ్యారేజ్‌ను ‘హోమ్ క్లాస్‌రూమ్’గా మార్చేసి తన కూతురుకు ఇంట్లోనే స్కూల్ అట్మాస్పియర్‌ను కల్పించాడు. స్కూల్ స్టైల్ డెస్క్, స్క్రీన్, టైమ్ టేబుల్, వైట్ బోర్డ్‌లను ఏర్పాటు చేశాడు. అన్నీ ఉన్నాయి కానీ, ఓ ఉపాధ్యాయుడు కూడా ఉంటే.. సెటప్ లుక్ పర్ఫెక్ట్‌గా ఉంటుందని భావించాడు. దాంతో ఓ టీచర్ కటౌట్‌ను చేయించి బోర్డు ముందు నిలబెట్టాడు. ఆ కటౌట్ చూస్తే.. నిజంగానే అక్కడ టీచర్ ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది. అంతేకాదు, ఆ కటౌట్ ముఖం భాగంలో ఓ ఐపాడ్‌ను అమర్చాడు. ఇక ఇంటర్నెట్‌లో మేడమ్ పాఠాలు చెబుతుంటే.. తన ముందు నిల్చొని చెప్పినట్లుగానే ఆ విద్యార్థి ఫీల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ తండ్రి డెడికేషన్‌ను అభినందిస్తున్నారు. తాము కూడా ఆ ఐడియాను ఫాలో అవుతామని కామెంట్లు పెడుతున్నారు.



Next Story