‘భారత్‌ను ఏకతాటిపైకి తీసుకు రావడమే లక్ష్యంగా సైకిల్ యాత్ర’

by  |
CRPF cycling
X

దిశ, రాజేంద్రనగర్ : భారత దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు రావడానికే సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నామని సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండర్ రమేష్ కుమార్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కన్యాకుమారి నుండి 20 మందితో చేపట్టిన సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ చేరుకుంది. సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికి సన్మానించిన ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య వారికి మద్దతుగా సైకిల్ యాత్రలో పాల్గొని చంద్రాయనగుట్ట వరకు సైకిల్ తొక్కారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశం అంతా ఒకటే అన్న భావంతో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ సైకిల్ యాత్రకు అన్ని ప్రాంతాలలో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపిస్తున్నారు అని అన్నారు. ఈ సైకిల్ యాత్ర ప్రాంతానికి ఓ భాషకు సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాలుపంచుకున్నారు అని తెలిపారు. ఆగష్టు 22న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న ఢిల్లీలోని రాజ్ ఘాట్ చేరుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎసీపీ సంజయ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed