- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మెయిల్ విలువ రూ.52 లక్షలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు..రూ.52 లక్షలు మోసం చేసారు. హైదరాబాదుకు చెందిన పోకర్ణ గ్రానైట్ అనే కంపెనీ, సౌత్ అమెరికా చెందిన కంపెనీతో ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నారు. నకిలీ ఈమెయిల్‌తో ఆర్డర్ చేసిన మెటీరియల్ పంపించామని.. అందుకుగాను 59 వేల యూరోలు ( 52 లక్షల రూపాయలు ) అకౌంట్‌లో ట్రాన్స్ ఫర్ చేయాలని హైదరాబాద్‌కి చెందిన కంపెనీకి ఈమెయిల్ చేశారు. దీంతో కంపెనీ ప్రనినిధులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు..రూ.52 లక్షలు మోసం చేసారు. హైదరాబాదుకు చెందిన పోకర్ణ గ్రానైట్ అనే కంపెనీ, సౌత్ అమెరికా చెందిన కంపెనీతో ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నారు. నకిలీ ఈమెయిల్‌తో ఆర్డర్ చేసిన మెటీరియల్ పంపించామని.. అందుకుగాను 59 వేల యూరోలు ( 52 లక్షల రూపాయలు ) అకౌంట్‌లో ట్రాన్స్ ఫర్ చేయాలని హైదరాబాద్‌కి చెందిన కంపెనీకి ఈమెయిల్ చేశారు. దీంతో కంపెనీ ప్రనినిధులు కూడా ఎప్పటిలాగే ఈమెయిల్‌లో ఉన్న అకౌంట్‌లోకి రూ.52 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు. అనంతరం రోజులు గడుస్తున్నా.. మెటీరియల్ రాకపోడంతో అనుమానం వచ్చి, నకిలీ ఈమెయిల్‌ను గుర్తించారు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంపెనీ ప్రతినిధి గౌతమ్ జైన్ ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






