తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్.. క్యూ న్యూస్ ఆఫీస్‌లో సోదాలు

651
teenmaar mallanna

దిశ, మేడిపల్లి: తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని మేడిపల్లి క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మల్లన్న యూనిట్ ఆఫీస్‌లో‌కి చొరబడ్డారు. లోకల్ పోలీసులతో పాటు మూడు ప్రత్యేక వాహనాల్లో క్యూ న్యూస్ ఆఫీస్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇప్పటివరకు సోదాలకు కారణం ఏంటో పోలీసులు పెదవి విప్పడం లేదు. క్యూ న్యూస్ ఆఫీస్‌లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయని.. వాటిని చూసి తాను ప్రశ్నించడంతో ఘర్షణ జరిగిందని తీన్మార్ మల్లన్న టీం స్పోక్స్ పర్సన్, జర్నలిస్ట్ చిలుకా ప్రవీణ్ మల్లన్నపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..