- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిడ్నీ కొంటామంటూ దంపతులకు టోకరా..
<p>దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కిడ్నీ కొంటామంటూ దంపతులకు ఆన్‌లైన్ ద్వారా గాలం వేశారు. వీరి మాయలో పడిన విజయవాడ దంపతులు సుమారు రూ.16.61లక్షలు పొగొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. తమకు కిడ్నీ అవసరం ఉందని, అమ్మితే రూ.2 కోట్లు చెల్లిస్తామని కేటుగాళ్లు నమ్మబలికారు. అయితే, వివిధ ఖర్చుల కింద కొంత డబ్బులు అవసరం పడుతాయని దంపతులను నమ్మించారు. దీంతో వారు రూ.16.61లక్షలు ఆన్ లైన్ ద్వారా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కిడ్నీ కొంటామంటూ దంపతులకు ఆన్‌లైన్ ద్వారా గాలం వేశారు. వీరి మాయలో పడిన విజయవాడ దంపతులు సుమారు రూ.16.61లక్షలు పొగొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. తమకు కిడ్నీ అవసరం ఉందని, అమ్మితే రూ.2 కోట్లు చెల్లిస్తామని కేటుగాళ్లు నమ్మబలికారు.
అయితే, వివిధ ఖర్చుల కింద కొంత డబ్బులు అవసరం పడుతాయని దంపతులను నమ్మించారు. దీంతో వారు రూ.16.61లక్షలు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. అనంతరం తిరిగి వారిని కాంటాక్ట్ చేయాలని చూస్తే అటు నుంచి రెస్పాన్స్ లేదు. తీరా మోసపోయామని భావించిన బాధితులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సైబర్ నేరగాళ్ల మోసం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also…
Next Story






