అంజలి అంజలి.. రీక్రియేషన్ విత్ ‘అల్లు అర్హ’

by  |
అంజలి అంజలి.. రీక్రియేషన్ విత్ ‘అల్లు అర్హ’
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురు అర్హకు ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. ఇది బెస్ట్ డాడ్, తన క్యూటెస్ట్ డాటర్‌కు అందించిన ది బెస్ట్ గిఫ్ట్ మాత్రమే కాదు.. ఫ్యాన్స్‌కు బెస్ట్ ట్రీట్ కూడా. అంజలి సినిమాలో బేబీ షామిలి క్యూట్‌నెస్‌కు అడ్రస్‌గా నిలిచిపోయిన అంజలి అంజలి సాంగ్‌ను రీక్రియేట్ చేసి ‘అర్హస్ అంజలి’గా రిలీజ్ చేయగా.. ఫస్ట్ అప్పియరెన్స్‌లోనే ఆకట్టుకుంది అర్హ.

పాట చూస్తున్నంత సేపు అర్హ క్యూట్‌నెస్‌ను చూస్తూ ఆనందపడుతూనే ఉన్నామని చెప్తున్నారు అభిమానులు. అప్పుడు బేబి షామిలి అంజలికి ఎలా ఫిదా అయిపోయారో.. అంజలిగా అల్లు అర్హను చూసి కూడా అలాగే ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. స్వీట్ స్మైల్, కర్లీ హెయిర్‌తో అర్హ ఫస్ట్ స్క్రీన్ అప్పియరెన్స్ చాలా చాలా ప్రెట్టీగా ఉండగా.. తనతో పాటు అన్న అల్లు అయాన్, తాత అల్లు అరవింద్ కూడా కవర్ సాంగ్‌లో కనిపించారు. సాంగ్ చివరలో అల్లు అర్జున్ కూడా సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అభిమానులకు ఫుల్ శాటిస్‌ఫాక్షన్ అందించాడు. దీంతో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.



Next Story

Most Viewed