దారుణం.. హోటల్ యజమానిని కత్తితో పొడిచిన కస్టమర్లు

by  |

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకులు హోటల్ లో యజమానితో ఘర్షణకు దిగారు. అడ్డువచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం యజమానిని కత్తితో పొడిచారు. ఈ సంఘటన శనివారం రాత్రి ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణానికి చెందిన లకన్, కార్తీక్ అనే ఇద్దరు యువకులు ఆర్మూర్ పట్టణంలోని మండి 95 హోటల్ లో భోజనం చేసేందుకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువకులు బిల్లు చెల్లించే విషయంలో ఘర్షణకు దిగారు. యజమాని ప్రపుల్ పై కత్తితో దాడి చేశారు. అడ్డు వచ్చిన ఇద్దరు హోటల్ సిబ్బందిని చితకబాదారు. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed