మహిళ గుండెతో కూర.. అత్తామామకు వడ్డించి..

by  |
మహిళ గుండెతో కూర.. అత్తామామకు వడ్డించి..
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలోని ఓక్లహోమాలో ఓ వ్యక్తి అత్యంత కృరంగా ప్రవర్తించాడు. ఓ మహిళను హత్య చేయడంతోపాటు ఆమె గుండెను తీసుకెళ్లి మరో ముగ్గురికి వండిపెట్టి వారిలో ఇద్దరిని హత్య చేశాడు. పోలీసుల ఒళ్లు సైతం గగుర్పాటుకు గురైన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

లారెన్స్ పాల్ ఆండర్సన్.. 2017 మాదకద్రవ్యాల ఆరోపణలపై అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించాడు. అతడు జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే ఆయన ఇంటి సమీపంలో ఓ మహిళను హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి, గుండెను తన వెంట తీసుకెళ్లాడు. ఆండర్సన్.. ఆ గుండెతో నేరుగా ఆయన మామ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆలుగడ్డలతో కలిసి గుండెను కూర వండి.. మామ, అత్తతోపాటు వారి నాలుగేళ్ల మనవడికి వడ్డించాడు. అనంతరం వారి ముగ్గురిపై కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రగాయాలైన ముగ్గురిలో మామ, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆండర్సన్ అత్త చికిత్స పొంతుతోంది. మంగళవారం ఈ హత్యలు జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి చికాషాలోని గ్రేడి కౌంటీ కోర్టులో హాజరు పరిచారు.


Next Story

Most Viewed