కరెంట్ అఫైర్స్ - 2022: రాష్ట్రాలు

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్ - 2022: రాష్ట్రాలు
X

తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు:

తెలంగాణలో 2020 తో పోలిస్తే 2022 నాటికి భూగర్భ జలాల రీఛార్జి 16.63 శతకోటి ఘనపు మీటర్ల నుంచి 21.11 శతకోటి ఘనపు మీటర్లకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా - 2022 నివేదిక వెల్లడించింది.


అందుబాటులో ఉన్న భూగర్భజలాల్లో 19.25 శతకోటి ఘనపు మీటర్లు పెరిగినట్లు వెల్లడించింది. భూగర్భ జల వాడకం 53.32 శాతం నుంచి 41.6 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. దీనికి ప్రధాన కారణం మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ పనులు, సాగునీటి అవసరాల కోసం ఉపరితల జలాల లభ్యత పెరగడం, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేయడమేనని ఈ నివేదిక వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్:

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా డాక్టర్ సీవీ ఆనంద బోస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

అక్కడ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా మణిపూర్ గవర్నర్ లా గణేషన్ నిర్వహించారు.

ఇప్పుడు పూర్తి స్థాయి గవర్నర్ గా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత మేఘాలయ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సీవీ ఆనంద బోస్ నియమితులయ్యారు.


జార్ఖండ్ శాసనసభలో 77 శాతానికి పెంచిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం:

జార్ఖండ్ లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60 శాతం నుంచి 77 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది.

జార్ఖండ్ ఉద్యోగాలు, సర్వీసులలో రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన 2001 నాటి బిల్లుకు ఈ మేరకు సవరణ చేసింది.

తాజా బిల్లు వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తాజా బిల్లు వల్ల 77 శాతానికి పెరుగుతాయి.

దీనికి చట్టబద్ధత అందించడానికి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో తగు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ప్రభుత్వం నిర్ధేశించింది.




Next Story

Most Viewed