కరెంట్ అఫైర్స్: అంతర్జాతీయం

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్: అంతర్జాతీయం
X

ఫోర్బ్స్ మహిళా పారిశ్రామికవేత్తల్లో ముగ్గురు భారతీయులు:

ఫోర్బ్స్ ఆసియా నవంబర్ మ్యాగజైన్‌‌లో ముగ్గురు భారత మహిళా వ్యాపారవేత్తలకు చోటు దక్కింది.

మూడేళ్ల పాటు కరోనా పరిణామాలు ఇబ్బందులకు గురిచేసినా, వ్యాపారాలను తమదైన వ్యూహాలతో నడిపిన 20 మంది ఆసియా మహిళలతో ఓ జాబితాను ఫోర్బ్స్ ప్రచురించింది.

భారత్ నుంచి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ సోమా మండల్, ఎమ్ క్యూర్ ఫార్మా భారత వ్యాపార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్, హోనాసా కన్జూమర్ సహ - వ్యవస్థాపకులు, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఘజల్ అలఘ్ ఈ జాబితాలో నిలిచారు.


పర్యావరణ పరిరక్షణ సూచీలో భారత్‌కు 8వ స్థానం:

కాలుష్యం బారి నుంచి పుడమిని పరిరక్షించుకునే చర్యల్లో మన దేశం తన నిబద్ధతను చాటుకుంటోంది.

గతంలో కన్నా మెరుగైన పనితీరుతో తన స్థానాన్ని మరింత మెరుగు పరచుకుంది.

పర్యావరణ మార్పు ఆచరణ సూచీ (సీసీపీఐ) - 2023కి 8వ ర్యాంకును పొందింది.


నెట్‌వర్క్ సంసిద్ధత సూచీలో భారత్‌కు 61వ స్థానం :

అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ పోర్చులాన్స్ ఇన్ స్టిట్యూట్ రూపొందించిన నెట్ వర్క్ సంసిద్ధత సూచీ - 2022 (రెడీ నెస్ ఇండెక్స్) లో భారత్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 61వ ర్యాంకును పొందిందని టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపింది.


దేశ మొత్తం స్కోరు 2021 తో పోలిస్తే 2022 లో 49.74 నుంచి 51.19కి చేరింది. అమెరికా 80.3 స్కోరుతో అగ్ర స్థానంలో నిలవగా సింగపూర్ (79.35), స్వీడన్ (78.91)లు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి.

READ MORE

తెలంగాణ ప్రభుత్వ పథకాల లిస్ట్, వాటి వివరాలు


Next Story

Most Viewed