లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 28-2-2023

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 28-2-2023
X

రష్యాపై ఆంక్షల అమలుకు జీ-7 దేశాల కోఆర్డినేషన్:

రష్యాపై ఆంక్షల అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని (ఎన్‌ఫోర్స్‌మెంట్ కోఆర్డినేషన్ మెకానిజమ్) జీ7 దేశాలు ఏర్పాటు చేయనున్నాయి. రష్యా యుద్ధంపై జీ-7 దేశాల నేతల సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ గా నిర్వహించనున్నారు. యుద్ధానికి రష్యాను జవాబుదారీ చేసేందుకు సమష్టిగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ కోఆర్డినేషన్ కు తొలి ఏడాది అమెరికా నేతృత్వం వహిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ వెల్లడించింది.

జీ -7 సభ్యదేశాలు:

1.అమెరికా

2.కెనడా

3.ఫ్రాన్స్

4.జర్మనీ

5.ఇటలీ

6.జపాన్

7.యూకే

నౌకదళ బార్జి విశాఖలో జల ప్రవేశం:

నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన ఎంసీఏ (మిసైల్ అమ్యూనిటైజేషన్) బార్జి విశాఖపట్నం నుంచి జలప్రవేశం చేసింది.

బార్జి అనగా భారీ నౌకలను ఒడ్డుకు చేర్చి, మళ్లీ సముద్ర జలాల్లోకి పంపేది.

భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మెజర్స్ సెకాన్ సంస్థ బార్జి నిర్మాణం చేపట్టిందని నేవీ వర్గాలు తెలిపాయి.

నౌకాదళ అవసరాల నిమిత్తం జెట్టీ, ఔటర్ హార్బర్ మధ్య సుమారు 30 ఏళ్ల పాటు నూతన బార్జి సేవలు అందించబోతున్నట్లు రియర్ అడ్మిరల్ సందీప్ మెహతా తెలిపారు.

మహారాష్ట్రలో రెండు నగరాల పేర్ల మార్పు:

కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్ల మార్పు నిర్ణయాన్ని ఆమోదించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

ఔరంగాబాద్ ను ఛత్రపతి శంభాజీ నగర్ గా...ఉస్మానాబాద్ ను ధారాశివ్ గా మార్పు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్థిక శక్తిగా హైదరాబాద్:

దేశంలోనే హైదరాబాద్ నగరం ఆర్థిక శక్తిగా దూసుకుపోతుందని యూకేకు చెందిన అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సావిల్స్ పేర్కొంది.

హైదరాబాద్ ది స్ప్రింట్ పేరుతో రూపొందించిన నివేదికను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో విడుదల చేశారు.

హైదరాబాద్ ఆర్థిక ఎదుగుదలకు ఆధారమైన 4 ప్రధాన కారణాలను నివేదికలో పేర్కొంది.

1.విధానాలతో ప్రోత్సాహం: ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీ 2.0, తెలంగాణ ఈవీ పాలసీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ (ఈఎస్ఎస్), స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్, రాష్ట్ర వ్యాప్త ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్, గ్రిడ్ పాలసీ, టీఎస్ ఐపాస్ హైదరాబాద్ అభివృద్ధికి శక్తినిచ్చాయి.

2.మౌలిక వసతులు: ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, ఎన్ ఆర్ డీపీ సహా మౌలిక సదుపాయాల కల్పన అనుసంధానం పెరిగింది. ఈ అంశం రియల్ ఎస్టేట్ కు ఊతంగా మారింది. తాజాగా ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు, ఈ బీఆర్ టీఎస్ వంటి మరిన్ని ప్రణాళికలు ఉన్నాయి.

3.అఫర్డబులిటీ: దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో నివాసాలు, అద్దెలు 10 నుంచి 20 శాతం తక్కువ. 2020-22 మధ్య 23 లక్షల చదరపు అడుగుల కార్యాలయాలు స్థలాల్లో లీజింగ్ కార్యకాలపాలు జరిగాయి. దేశంలోని స్పేస్ డిమాండ్‌లో ఇది 15 శాతం.

4.మానవ నైపుణ్యాలు: ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో గత ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. 24 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. దేశంలో ఐటీ ఉపాధిలో ఇది మూడింట ఒక వంతు. ప్రస్తుతం ఇక్కడ 7.8 లక్షల మందికి ఐటీ రంగం ఉపాధి కల్పిస్తోంది. నగరం ఒక హ్యూమన్ క్యాపిటల్ గా నిలిచింది.

జీవశాస్త్రాలు, డేటా కేంద్రాలు, ఈవీ మొబిలిటీ వ్యాలీలు, ఏరోస్పేస్ వంటి రంగాలకు ప్రోత్సాహం.


Next Story

Most Viewed