కరెంట్ అఫైర్స్: 2-12-2022

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్: 2-12-2022
X

ఎగుమతుల్లో ఔషధ రంగం వాటా 33.41 శాతం:

తెలంగాణలో తయారైన వస్తు సామగ్రిలో అత్యధికం (26.26 శాతం) అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి.

ఆ తర్వాతి స్థానంలో చైనా (6.78 శాతం), రష్యా (4.01 శాతం) ఉన్నాయి.

రాష్ట్రంలో తయారయ్యే ఔషధాలతో పాటు ఆహార, జౌళి ఉత్పత్తులు, వైమానిక విడిభాగాలు అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.

దేశంలోని ఔషధ ఉత్పత్తిలో 30 శాతం తెలంగాణలో జరుగుతోంది.

దేశం నుంచి జరిగే ఔషధాల ఎగుమతిలో 50 శాతం వాటా రాష్ట్రానిదే.

మహారాష్ట్ర గ్రామానికి 26/11 దాడిలో అమరుడైన జవాన్ పేరు:

ముంబయి ఉగ్రదాడి 26/11 లో అమరుడైన జవాను రాహుల్ శిండే పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు.

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా సుల్తాన్ పూర్ లో 600 ఇళ్లు ఉంటాయి.

జవాను పుట్టిపెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్ నగర్‌గా మార్పు చేశారు.

ప్రభుత్వ లాంచనాలు పూర్తి కావాల్సి ఉంది.

స్టేట్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (ఎన్ఆర్‌పీఎఫ్) డ్యూటీలో ఉన్న రాహుల్.. తాజ్‌మహాల్ ప్యాలెస్ హోటల్‌లోకి ముందుగా ప్రవేశించగానే.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బాడీలోకి తూటాలు దూసుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

క్రీడలు:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా సూర్య:

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ తాజా టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

కివీస్‌తో రెండో టీ20లో 111 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు, తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు.

కివీస్‌తో సిరీస్ నుంచి 31 పాయింట్లు పొందిన అతడు ప్రస్తుతం 890 పాయింట్లతో ఉన్నాడు.

రెండో ర్యాంకు బ్యాట్స్‌మెన్ రిజ్వాన్‌పై సూర్య 54 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు.

హార్దిక్ పాండ్యా 50వ స్థానంలో నిలిచాడు.

ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు:

ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో భారత షూటర్లు మూడు స్వర్ణ పథకాలు సాధించారు.

మూడు స్వర్ణాలు సహా 5 పతకాలతో ఈ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు.

యూఏఈలో జరిగిన పోటీల్లో అయిదో స్థానంలో భారత్ నిలిచింది.

20 పతకాలతో దక్షిణ కొరియా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.



Next Story

Most Viewed