ఏపీలో షాక్ ఇస్తున్న కరెంట్ బిల్లులు.. లబోదిబోమంటున్న వినియోగదారులు

by  |
ఏపీలో షాక్ ఇస్తున్న కరెంట్ బిల్లులు.. లబోదిబోమంటున్న వినియోగదారులు
X

దిశ, ఏపీబ్యూరో: కరెంట్ ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ బిల్లును ముట్టుకున్నా షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడింది. వందల్లో వచ్చే కరెంట్‌ బిల్లులు ఏకంగా వేలల్లో.. లక్షల్లో కాదు. కోట్లలో కూడా వస్తోంది. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఓ చిరు హోటల్ యజమానికి ఒక నెలలో రూ.48 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విద్యుత్ మీటర్‌ను మార్చారు. అయితే, సెప్టెంబర్ నెలలో కరెంట్ బిల్లు తీయగా ఏకంగా రూ.21 కోట్ల 48 లక్షలకు పైగా బిల్లు వచ్చింది.

ఈ ఘటన మరువకముందే రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పంక్చర్‌ షాపునకు రూ.57వేల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఆదోని వెకన్నబావి వీధిలో బసవ అన యువకుడు పంక్చర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. చిన్న షాపుకు రూ.57,965 కరెంటు బిల్లు రావడంతో షాపు నిర్వాహకులు లబోదిబోమంటున్నాడు. రూ.వేలలో కరెంటు బిల్లు రావడంతో.. కరెంటు బిల్లు చెల్లించేదెలా అని బాధితుడు వాపోతున్నాడు. ఈ వార్త ఇప్పుడు కర్నూలు జిల్లాలో హల్‌చల్ చేస్తోంది.


Next Story

Most Viewed