తృటిలో తప్పిన ప్రమాదం.. ఇంటిపై పడ్డ కరెంట్ పోల్!

by Batti.Sumithra |   (  Updated:2021-05-25 08:54:27  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలో తృటిలో ప్రమాదం తప్పింది. రాచమల్ల లింగయ్య అనే వ్యక్తి ఇంటి పక్కన గల కరెంటు స్తంభం ఈదురు గాలులకు దాటికి అతని ఇంటి పై పడింది. దీంతో రేకులు పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న వారు ప్రమాదాన్ని త్వరగా గమనించి బయటికి పరుగులు తీయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు స్తంభంపై గల కరెంటు తీగల గుండా కరెంటు సరఫరా జరిగింది. ఆ [&hellip;]</p>

తృటిలో తప్పిన ప్రమాదం.. ఇంటిపై పడ్డ కరెంట్ పోల్!
X

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలో తృటిలో ప్రమాదం తప్పింది. రాచమల్ల లింగయ్య అనే వ్యక్తి ఇంటి పక్కన గల కరెంటు స్తంభం ఈదురు గాలులకు దాటికి అతని ఇంటి పై పడింది. దీంతో రేకులు పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న వారు ప్రమాదాన్ని త్వరగా గమనించి బయటికి పరుగులు తీయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు స్తంభంపై గల కరెంటు తీగల గుండా కరెంటు సరఫరా జరిగింది. ఆ సమయంలో అక్కడ జనం ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story