గర్జించిన చెన్నై సింహాలు.. IPL ఫైనల్‌లో CSK ఘన విజయం

by  |
గర్జించిన చెన్నై సింహాలు.. IPL ఫైనల్‌లో CSK ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్ : అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్ -2021 టోర్నీని ధోని సేన ఎగరేసుకుపోయింది. శుక్రవారం kkr vs csk మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసి సీఎస్కే జట్టు విధించిన 193 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు ఓపెనర్లు తొలి 10 ఓవర్లలో చెన్నై ఆటగాళ్లకు భయం అంటే ఎంటో చూపించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) చెరో అర్థ సెంచరీలతో ధోని సేనకు చుక్కలు చూపించారు.

అయితే, 10 ఓవర్ల తర్వాత మ్యాచ్ మొత్తం సీఎస్కే చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. చెన్నై బౌలర్లు విజృంభించడంతో కేకేఆర్ టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. వచ్చిన బ్యాట్స్‌మెన్స్ వచ్చినట్టే వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ -3, రవీంద్ర జడేజా-2, హజీల్ వుడ్ -2 వికెట్లు తీయడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం నల్లేరు మీద నడక అయ్యింది.

ఒకానొక సమయంలో 19వ ఓవర్లో 162/8 పరుగుల కేకేఆర్ టేలెండ్ బ్యాట్స్ మెన్స్ జట్టును గెలిపించేందుకు చాలా కష్టపడ్డారు. కానీ చివరి ఓవర్‌ను బ్రావో తనదైన విధంగా స్లో బంతులు వేసి కేకేఆర్ జట్టుకు ఓటమి అంటే ఎంటో రుచి చూపించాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో KKR జట్టుపై 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చాలా మంది మాజీ సీనియర్ ఆటగాళ్లు చెప్పిన విధంగానే ధోని మరోసారి చెన్నై జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ధోని ఫామ్‌లో ఉన్నా లేకున్నా.. ఆయన కెప్టెన్సీలో సీఎస్కే జట్టు ఫైనల్‌లో గెలుస్తుందని సౌత్ ఆఫ్రికా పేసర్ డెేల్ స్టెయిన్ చెప్పిన జోస్యం నిజమైంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోని సారధ్యంలో నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది.


Next Story

Most Viewed