30 లక్షల డోసులు పంపండి.. కేంద్రానికి సీఎస్ లేఖ

82

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి అత్యవసరంగా 30లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసారు. తెలంగాణలో రోజుకు లక్ష మంది వ్యాక్సిన్ అందిస్తున్నామని త్వరలో ఈ సంఖ్యను రెండు లక్షలకు పెంచుతామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5లక్షల 65వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని 3 రోజుల్లో ఈ వ్యాక్సిన్ పూర్తిగా అయిపోతావని తెలిపారు. వీలైనంత త్వరగా రాష్ట్రానికి 30లక్షల డోసుల వ్యాక్సిన్ ను పంపించాలని కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..