- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన పంటినొప్పి
<p>దిశ వెబ్‌డెస్క్: భరించలేని పంటినొప్పితో ఒక మహిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మరణించిన విషాదకర సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్త పాడేరుకు చెందిన గంగపూజారి మౌనిక ఢిల్లీలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఫిబ్రవరిలో తన కుమార్తె బర్త్ డే ఉండటంతో.. గత నెలలో సెలవులపై ఇంటికొచ్చింది. తన కుమార్తె బర్త్ డేను ఘనంగా సెలబ్రెట్ చేసిన ఆమె.. సెలవులు పూర్తవడంతో త్వరలో విధుల్లో తిరిగి చేరాల్సి ఉంది. అయితే పంటినొప్పి బాగా బాధిస్తుండటంతో సెలవులు పొడిగించుకుని ఇటీవల […]</p>

దిశ వెబ్‌డెస్క్: భరించలేని పంటినొప్పితో ఒక మహిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మరణించిన విషాదకర సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. కొత్త పాడేరుకు చెందిన గంగపూజారి మౌనిక ఢిల్లీలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఫిబ్రవరిలో తన కుమార్తె బర్త్ డే ఉండటంతో.. గత నెలలో సెలవులపై ఇంటికొచ్చింది. తన కుమార్తె బర్త్ డేను ఘనంగా సెలబ్రెట్ చేసిన ఆమె.. సెలవులు పూర్తవడంతో త్వరలో విధుల్లో తిరిగి చేరాల్సి ఉంది.
అయితే పంటినొప్పి బాగా బాధిస్తుండటంతో సెలవులు పొడిగించుకుని ఇటీవల హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది. అనంతరం శనివారం ఉదయం దుస్తులు ఉతికేందుకు గ్రామ సమీపంలోని ఒక బావికి వెళ్లగా.. దుస్తులు ఉతకడం పూర్తైన తర్వాత తిరిగి ఇంటికొస్తున్న సమయంలో పంటినొప్పి మరింత ఎక్కువైంది.
దీంతో స్ఫృహతప్పి కిందపడిపోయిన ఆమెను బంధువులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.






