కొమురవెల్లి 'మల్లన్న' సన్నిధిలో భక్తుల రద్దీ

by Sridhar Babu |   (  Updated:2021-10-24 01:04:25  IST  )

<p>దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. శనివారం రాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజామున లేచి కొనేరులో పవిత్ర స్నానం ఆచరించి క్యూలైన్ లో నిలిచి స్వామివారిని దర్శించుకున్నారు. రేగుచెట్టు వద్ద, మహామండపంలో పట్నాలు వేసి, కేశ కండన, అభిషేకం, అర్చన, కళ్యాణం, రేగు చెట్టుకు ముడుపులు తదితర మొక్కులు చెలించుకొని కొండపై ఉన్న ఎల్లమ్మ అమ్మవారికి మట్టికుండలో బోనం, కల్లు సాక సమర్పించారు. ఆలయానికి వచ్చిన [&hellip;]</p>

Komuravelli1
X

దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. శనివారం రాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజామున లేచి కొనేరులో పవిత్ర స్నానం ఆచరించి క్యూలైన్ లో నిలిచి స్వామివారిని దర్శించుకున్నారు. రేగుచెట్టు వద్ద, మహామండపంలో పట్నాలు వేసి, కేశ కండన, అభిషేకం, అర్చన, కళ్యాణం, రేగు చెట్టుకు ముడుపులు తదితర మొక్కులు చెలించుకొని కొండపై ఉన్న ఎల్లమ్మ అమ్మవారికి మట్టికుండలో బోనం, కల్లు సాక సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అధికారులు బాలాజీ, అంజయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ భిక్షపతి సేవలందించారు.

Next Story