- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైలారం చెరువులో మొసలి.. భయంతో వణికిపోతున్న జనాలు
by Shyam |
<p>దిశ, కొత్తగూడ : సాధారణంగా మొసలిని జూ పార్క్లో చూస్తాం. అలాంటిది కండ్ల ముందు కనపడితే ఆ అనుభవం ఎంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొత్తగూడ మండలంలోని మైలారం చెరువులో మొసలి కదలికలు పరిసర రైతులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లిన రైతులకు మొసలి తారసపడింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువు చుట్టూ పొలాలు ఉండటంతో సాధారణంగా రైతులు రాత్రనకా, పగలనకా వెళ్తుంటారు. […]</p>

X
దిశ, కొత్తగూడ : సాధారణంగా మొసలిని జూ పార్క్లో చూస్తాం. అలాంటిది కండ్ల ముందు కనపడితే ఆ అనుభవం ఎంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొత్తగూడ మండలంలోని మైలారం చెరువులో మొసలి కదలికలు పరిసర రైతులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లిన రైతులకు మొసలి తారసపడింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువు చుట్టూ పొలాలు ఉండటంతో సాధారణంగా రైతులు రాత్రనకా, పగలనకా వెళ్తుంటారు. మొసలి కదలికలు గుర్తించిన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. మైలారం చెరువు పాకాల చెరువును ఆనుకొని ఉండటంతో మొసలి ఈ చెరువులోకి వచ్చినట్లు రైతులు అనుమానిస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని చెరువులో నుంచి తరలించాలని కోరుతున్నారు.
Next Story






