‘కొత్త ధరలతో ఇళ్లు కొనలేని స్థితిలో గెజిటెడ్ ఆఫీసర్’

by Shyam |   (  Updated:2021-07-21 06:52:28  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూముల విలువలను, రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు వల్ల సామాన్యుడు మోయలేని భారమవుతుందని తెలంగాణ రియల్టర్స్​ అసోసియేషన్ ​రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​కుమార్​ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ప్రకటనను విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచడం వల్ల కొనుగోలుదారుడికి ఎంతో భారంగా పరిణమిస్తుందన్నారు. ఒక్కో కొనుగోలు మీద రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు అదనపు భారం పడుతుందన్నారు. దీన్ని తెలంగాణ [&hellip;]</p>

‘కొత్త ధరలతో ఇళ్లు కొనలేని స్థితిలో గెజిటెడ్ ఆఫీసర్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూముల విలువలను, రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు వల్ల సామాన్యుడు మోయలేని భారమవుతుందని తెలంగాణ రియల్టర్స్​ అసోసియేషన్ ​రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​కుమార్​ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ప్రకటనను విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచడం వల్ల కొనుగోలుదారుడికి ఎంతో భారంగా పరిణమిస్తుందన్నారు. ఒక్కో కొనుగోలు మీద రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు అదనపు భారం పడుతుందన్నారు. దీన్ని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

మార్కెట్ విలువలు పెరగటం వల్ల ఎల్ఆర్ఎస్​ చార్జీలు కూడా పెరుగుతాయన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక ప్లాట్‎కు ఎల్ఆర్ఎస్ ​చార్జీలు రూ. 3 లక్షలు వరకు చెల్లించాల్సి వస్తుందన్నారు. మార్కెట్ విలువ 50 శాతం పెరిగిన ప్లాటుకు అదనంగా లక్షన్నర అంటే మొత్తం కలిపి రూ.4.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ భారం 26.59 లక్షల దరఖాస్తుదారుల మీద పడుతుందన్నారు. మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల వల్ల ఎల్ఆర్ఎస్ ​చార్జీలు పెంచిన కారణాన్ని చూపి బహిరంగ మార్కెట్లోనూ ధరలను పెంచే అవకాశం ఉందన్నారు.

గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి అధికారి కూడా పట్టణ పరిధిలో ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి వస్తుందన్నారు. రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుందన్నారు. అందుకే రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గించాలని, ఎల్ఆర్ఎస్​ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సుప్రీం కోర్టులో కేసు ఉండగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​ ఫీజులు వసూలు చేయలేదన్నారు. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను మరచిపోవడం కోసమే అందరినీ కన్ఫ్యూజ్ ​చేయడానికే ఎల్ఆర్ఎస్ ​పై కొత్త ఉత్తర్వులను జారీ చేసినట్లు ఎద్దేవా చేశారు.

Follow Disha daily official Facebook page : https://www.facebook.com/dishatelugunews

Next Story