Crime : మనస్తాపంతో యువతి ఆత్మహత్య

by Taduka Kalyani |

మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Crime : మనస్తాపంతో యువతి ఆత్మహత్య
X

దిశ,దుండిగల్ : మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గండిమైసమ్మ చౌరస్తా గణేష్ నగర్ కాలనీలో నర్సింహ కుటుంబ సభ్యులతో కలిసి సాయి మీనా అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అతని కుమార్తె టి.కావ్యశ్రీ(22) సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదివింది. గుంటూరులో ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులను వదిలి వెళ్లడానికి అంగీకరించలేదు. కుటుంబ సభ్యులు గుంటూరు వెళ్లాలని బలవంతం చేయగా మనస్తాపానికి గురైన యువతి తను ఉంటున్న అపార్ట్మెంట్ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చికిత్స నిమిత్తం స్థానిక సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పి.సతీష్ తెలిపారు.

Next Story