- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగికంగా వేధిస్తున్న మేనల్లుడు.. ఫిర్యాదు చేస్తే కట్టేసి కొట్టి గుండు గీశారు
ఓ మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై దాడి చేసి గుండు కొట్టిన మరో అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై లైంగిక వేధింపులు (Molestation), దాడుల ఘటనలు దేశంలో నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై దాడి చేసి గుండు కొట్టిన మరో అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లో వెలుగులోకొచ్చింది. పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కన్నౌజ్ (Kannauj)లో నివశిస్తున్న ఓ మహిళ మేనల్లుడు రాజనాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అతడి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె చెబుతోంది నిజమో, అబద్ధమో కూడా పట్టించుకోకుండా రాజనాథ్ కుటుంబసభ్యులు (Family Members) ఆమెని దుర్భాషలాడి దాడికి దిగారు. విపరీతంగా కొట్టి చేతులు, కాళ్లు కట్టేసి శిరోముండనం చేశారు.
నిందితుల అచాచకం ఇక్కడితో ఆగలేదు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా (Social media)లో కూడా పోస్ట్ చేశారు. కాగా.. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసుల వరకు చేరింది. దీంతో కేసు నమోదు చేసి ఆరుగులు నిందితులను అరెస్ట్ చేశామని కనౌజ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగిందని, దాడి చేసిన వారిలో బాధితురాలి భర్త కూడా ఉన్నాడని ఆయన తెలిపారు.






