పిడుగుపాటుతో మ‌హిళ మృతి..

by Taduka Kalyani |

మిర‌ప‌నారు వేస్తున్న మ‌హిళా కూలీపై పిడుగుప‌డ‌టంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది.

పిడుగుపాటుతో మ‌హిళ మృతి..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: మిర‌ప‌నారు వేస్తున్న మ‌హిళా కూలీపై పిడుగుప‌డ‌టంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈసంఘ‌ట‌న జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ పల్లిలో శ‌నివారం జ‌రిగింది. గ్రామానికి చెందిన పొనగంటి సులోచన(44) ఓ రైతు పొలంలో మిర‌ప నాటు వేసేందుకు వెళ్లింది. ఈ క్ర‌మంలోనే భారీ వాన మొద‌ల‌వ‌గా ఒడ్డుకు చేరుకుంటున్న స‌మ‌యంలోనే ఆమెపై పిడుగు ప‌డ‌టంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త భాస్కర్ రావు, కూతురు, కుమారుడు ఉన్నారు.

Next Story