కుటుంబ కలహాలతో మహిళ మృతి

by Sridhar Babu |   ( Updated:2024-09-14 11:32:28.0  )
కుటుంబ కలహాలతో మహిళ మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం : కుటుంబ కలహాలతో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కపాటి మంజుల (48) ఇబ్రహీంపట్నం నివాసి. ఆమె లంగర్ హౌస్ మున్సిపల్ లో స్వీపర్​ గా ఉద్యోగం చేస్తుంది. గత రెండు నెలల కిందట ఆమె భర్త పున్నయ్య అనారోగ్యంతో చనిపోయాడు. ఈమెకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు వినోద్ మున్సిపల్ ఉద్యోగి. ఇతనికి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడు రోజుల క్రితం గొడవ జరిగింది. దాంతో మనస్థాపంతో ఇబ్రహీంపట్నం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story