- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మీరట్‌లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మీరట్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన పై రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కసం పూర్ వద్ద వందే భారత్ రైలు వస్తున్న క్రమంలో క్రాసింగ్ గేట్లను మూసివేశారు. ఆ సమయంలో పట్టాలు దాటేందుకు 40 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రయత్నించారు. అదే సమయంలో అత్యంత వేగంగా వచ్చిన వందేభారత్ వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీయూష్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారిని మోనా (40) మనీషా (14), చారు (7)గా గుర్తించారు.
Next Story






