- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
by Sridhar Babu |
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, శామీర్ పేట : అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తుర్కపల్లి లోని జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన రాకేష్ సెర్వి(35) గత కొంతకాలంగా షామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామంలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా ఇటీవల వ్యాపారంలో నష్టపోవడంతో మనస్థాపనతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడ. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- suicide
Next Story






