ఇంజనీరింగ్ విద్యార్థిని న్యూడ్ వీడియోస్ వైరల్.. ఆరా తీయగా ‘డబుల్’ రేప్ వెలుగులోకి..

by Bhoopathi Nagaiah |

అమ్మాయిల అమాయకత్వం, విక్‌నెస్‌ను ఆసరాగా తీసుకుని కామంధులు రెచ్చిపోతున్నారు.

ఇంజనీరింగ్ విద్యార్థిని న్యూడ్ వీడియోస్ వైరల్.. ఆరా తీయగా ‘డబుల్’ రేప్ వెలుగులోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిల అమాయకత్వం, విక్‌నెస్‌ను ఆసరాగా తీసుకుని కామంధులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తున్నానని.. చంపేస్తానని బెదిరించి అత్యాచారాలు చేస్తున్నారు. ఆపై సీక్రెట్‌గా నగ్న ఫొటోలు, వీడియోలు చూసి బ్లాక్ మెయిల్ చేస్తూ వరుసగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలోని విజయవాడలో ఇదే మాదిరిగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ యువతి విజయవాడలో బీటెక్ చదువుతోంది. ఆమెకు తాడిపత్రి మండలానికి చెందిన కృష్ణారెడ్డితో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న అతడు ఆమెను ప్రేమిస్తున్నా అంటూ గత ఐదు నెలలుగా వెంటపడుతున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో బ్లేడ్‌తో చెయ్యి కోసుకోని యువతిని నమ్మించాడు. దీంతో అతడు నిజంగానే తనను ప్రేమిస్తున్నాడని అతడితో చనువుగా ఉండేది. ఈ క్రమంలో అక్టోబర్ 19న యువతికి ఫోన్ చేసిన కృష్ణారెడ్డి.. వెంటనే బెంగళూరు రావాలని, లేకపోతే మన ఇద్దరి వ్యవహారాన్ని మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు చెబుతానని బెదిరించాడు. భయపడిన యువతి మరుసటి రోజు బెంగళూరు వెళ్లింది. అక్కడ తన మిత్రుడి రూంకు తీసుకెళ్లిన కామాంధుడు నాలుగు రోజులపాటు అత్యాచారం చేశాడు. అది భరించలేని యువతి అక్కడ నుంచి తప్పించుకోని తన సొంతూరుకు వచ్చింది.

వారం రోజులు రెస్ట్ తీసుకున్న యువతి కాలేజీకి వెళ్లడానికి అక్టోబర్ 28న విజయవాడ బయలుదేరింది. తన తండ్రి ఆమెను కలిసి గుత్తి వరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్లాడు. అదే సమయంలో గుంతకల్లు పట్టణానికి చెందిన దివాకర్ సదరు యువతికి ఫోన్ చేసి.. బెంగళూరులో కృష్ణారెడ్డితో నువ్వు శృంగారం చేసిన వీడియోలు, ఫొటోలు నా దగ్గర ఉన్నాయి.. నువ్వు వెంటనే గుంతకల్లుకు రాకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతా అని బెదిరించాడు. భయపడిన యువతి అక్కడికి వెళ్లగా ఆమెను ఓ లాడ్జీకి తీసుకెళ్లి రెండురోజుల పాటు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో కూడా సీక్రెట్‌గా నగ్న వీడియోలను తీసి కృష్ణారెడ్డికి పంపించాడు. అత్యాచారం తర్వాత నగ్న వీడియోలు డిలీట్ చేస్తానని దివాకర్ చెప్పడంతో నమ్మిన యువతి విజయవాడ కాలేజీకి వెళ్లింది. కానీ కృష్ణారెడ్డి, దివాకర్ కలిసి యువతి న్యూడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి చూశాడు. తెలిసిన అమ్మాయి కావడంతో వెంటనే యువతి బంధువులకు సమాచారం ఇచ్చారు. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు యువతి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘోరాన్ని వివరించి భోరున విలపించారు. కృష్ణారెడ్డి, దివాకర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు వారి ఆచూకీ కోసం జల్లెడపడుతున్నారు.

Next Story