- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
by Sridhar Babu |
భద్రాచలంతో పాటు చుట్టు పక్కల వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ ను భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంతో పాటు చుట్టు పక్కల వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ ను భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్ సారపాకకు చెందిన అద్దంకి రాఘవన్, ఇదే ప్రాంతానికి చెందిన కోసల మిథున్ తో పాటు మరో నలుగురు కలిసి నిలిపి ఉంచిన మోటార్ సైకిళ్లను, సెల్ ఫోన్లను దొంగిలించి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. దాంతో బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తుండగా వీరు దొరికారు. వీరిని రిమాండ్ కి తరిలించి పరారీలో ఉన్న వారి గురించి గాలిస్తున్నట్టు తెలిపారు. వీరిని పట్టుకోవడంలో సహకరించిన పోలీసులను భద్రాచలం ఎస్ హెచ్ ఓ సంజీవ రావు అభినందించారు.
- Tags
- bike theft
Next Story






