- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతి వేగం వ్యక్తి ప్రాణం తీసింది
by Sridhar Babu |
కారును రాష్ డ్రైవింగ్ చేస్తూ వ్యక్తిని ఢీకొనడంతో అతను అక్కడేకక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, పేట్ బషీరాబాద్ : కారును రాష్ డ్రైవింగ్ చేస్తూ వ్యక్తిని ఢీకొనడంతో అతను అక్కడేకక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దేవేందర్ నగర్ పైపు నుంచి గాజులరామారం గ్రామం వైపుగా ఆదివారం ఉదయం సమయంలో మహేంద్ర ఎక్స్యువి వాహనంలో మనీష్ అనే యువకుడు మరో ఐదుగురు యువకులతో కలిసి వేగంగా కారు నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో మూలమలుపు వద్ద
నడుచుకుంటూ వెళ్తున్న భాషా గోపి (33) అనే వ్యక్తిని బలంగా ఢీకొనడంతో అతను 10 మీటర్ల అవతలకు ఎగిరిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్నేహితులు పరారీలో ఉండగా కారు నడుపుతున్న మనిష్ గౌడ్ (20) ని పోలీసులు అదుపులోకి తీసుకొని టెస్ట్ చేయగా అతను మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లు ధ్రువీకరణ అయినట్లు జీడిమెట్ల సీఐ మల్లేష్ తెలిపారు.
- Tags
- person died
Next Story






