- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో మూడు కాలిపోయిన మృతదేహాలు లభ్యం
by Malleboina Mahesh |
తమిళనాడు రాష్ట్రంలోని కడూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని కడూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఒక్కో గదిలో ఒక్కో మృతదేహం చొప్పున ముగ్గురు మంటల కారణంగా కాలిపోయిన స్థితిలో కనిపించారు. దీంతో పోలీసులు ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించగా.. హత్య చేసి తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేశారో అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఘటనలో చనిపోయిన వారిని సుదన్ కుమార్, అతని తల్లి, కుమారుడిగా పోలీసులు గుర్తించారు. సుదన్ కుమార్ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు.
Next Story






