- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈజీ మనీ కోసం దొంగలుగా మారారు
కష్టపడి పని చేయకుండా ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులను తిరుమలగిరి పోలీసులు, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయగా వారిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

దిశ, సూర్యాపేట : కష్టపడి పని చేయకుండా ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులను తిరుమలగిరి పోలీసులు, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయగా వారిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన పోలేపాక రమేశ్, జాజిరెడ్డి గూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జీడి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరు 4 చైన్ స్నాచింగ్ కేసులు,10 బైక్ దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి రూ. 3.95 లక్షల విలువ గల 13 బైకులు, రూ.1.49 లక్షల విలువ గల 3.7 తులాల బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వివరించారు.
జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం ఉదయం రమేష్, నరేష్ అనే నిందితులు బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తుండగా స్థానిక ఎస్సై తన సిబ్బందితో తిరుమలగిరి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వారి బైక్‌ని ఆపారు. కాగా వారు బైక్ తో సూర్యాపేట వైపు పరారు కాగా పోలీసులు వారిని పట్టుకొని విచారించగా పలు కేసుల్లో తాము నిందితులమని ఒప్పుకున్నట్లు చెప్పారు. 2020లో తిరుమలగిరి పరిధిలో ఓ మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడును దొంగతనం చేశారని, అంతేకాక కొడకండ్ల, తుంగతుర్తి, శాలిగౌరారం పోలీస్ స్టేషన్స్ పరిధిలో చైన్ స్నాచింగ్స్, సూర్యాపేట పట్టణ, రూరల్, నకిరేకల్, జనగాం, తొర్రూర్, ఆత్మకూర్ (ఎస్), కేతేపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో 10 బైక్స్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని వివరించారు. పోలేపాక రమేశ్ పైన 16 కేసులతో పాటు 2018 రూరల్, కొడకండ్ల, లింగాల ఘనపూర్,భువనగిరి, నూతనకల్, ఆత్మకూర్(S) దంతాలపల్లి, తుంగతుర్తి, తొర్రూర్, సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో మరో 12 కేసుల్లో నిందితుడని ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ శివ కుమార్, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, సీసీఎస్ ఎస్సై శ్రీకాంత్, తిరుమలగిరి ఎస్సై సురేష్, సీసీఎస్ సిబ్బందిని, కేసు లీడ్ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి జి.రవిలను ఎస్పీ అభినందించారు.






