- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరి..
by Batti.Sumithra |
జిన్నారం మండలంలోని దాడిగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితులు, జిన్నారం ఎస్సై నాగలక్ష్మి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

X
దిశ, జిన్నారం : జిన్నారం మండలంలోని దాడిగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితులు, జిన్నారం ఎస్సై నాగలక్ష్మి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఊట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని డాడిగూడ గ్రామానికి చెందిన బంధం కొమ్ము మంజుల అనే మహిళ ఇంటికి తాళం వేసి రాత్రి షిఫ్టులో విధులు నిర్వహించేందుకు వెళ్ళింది. దీన్ని గమనించిన ఐదుగురు వ్యక్తులు తెల్లవారుజామున ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో గల బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించుకుపోయారు. వీటితో పాటు కొంత నగదు పోయిందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






