- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Theft : మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ
by Chintha Aamani |
మహిళ మెడలో నుండి గుర్తు తెలియని వ్యక్తి పుస్తెలతాడు

X
దిశ,కమలాపూర్: మహిళ మెడలో నుండి గుర్తు తెలియని వ్యక్తి పుస్తెలతాడు చోరీ చేసిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తుమ్మ లక్ష్మీ అనే మహిళ మంగళవారం సుమారు రాత్రి 1 గంట సమయంలో మూత్ర విసర్జన కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు బలవంతంగా మహిళ మెడలోని బంగారం పుస్తెలు తాడు లాక్కుని వెళ్ళాడు. పుస్తెలతాడు విలువ సుమారు రూ. 95000 ఉంటుందని ,బాధితురాలు కొడుకు తుమ్మ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ విషయం పై కాజీపేట ఎసీపీ తిరుమల్ గారు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితురాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు
- Tags
- Telugu News
- Theft
Next Story






