- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Murder : తండ్రిని చంపిన తనయుడు
ఓ వ్యక్తి తన తండ్రిని చంపిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, రాజేంద్రనగర్ : ఓ వ్యక్తి తన తండ్రిని చంపిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి కాలనీకి చెందిన కిష్టప్ప, మహేందర్ తండ్రి కొడుకులు. కిష్ణప్ప స్థానికంగా చెత్త కాగితాలు ఏరుకొని వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తుండేవాడు. కొంతకాలంగా కిష్టప్ప కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని మహేందర్ గొడవ పడుతుండేవాడు. అదేవిధంగా తమ కుటుంబానికి ఉన్న కొంత భూమిని అమ్మేసి డబ్బులు తనకు ఇవ్వాలని వేధించసాగాడు.
ఈ క్రమంలో అతడు ఆదివారం తన తండ్రి కిష్టప్పను అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో మహేందర్ తన తండ్రిని చంపాడు అని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Murder






