ఆత్మహత్య చేసుకున్న యువతి.. మృతదేహం నుంచి ‘కళ్లు’ కొట్టేసిన కేటుగాళ్లు

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-12-12 13:37:31  IST  )

దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్టు ఉంది ఈ ఘటనను చూస్తే. ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహం నుంచి కళ్లను కొట్టేశారు దుండగులు.

ఆత్మహత్య చేసుకున్న యువతి.. మృతదేహం నుంచి ‘కళ్లు’ కొట్టేసిన కేటుగాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్టు ఉంది ఈ ఘటనను చూస్తే. ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహం నుంచి కళ్లను కొట్టేశారు దుండగులు. దహన సంస్కారాల సమయంలో కుటుంబ సభ్యులు గుర్తించి ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బదాయు జిల్లాకు చెందిన ఓ 20 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అత్తారింటికి వెళ్లి తన కూతురును వరకట్నం కావాలని వేధించారని ఆరోపించారు. అదనపు కట్నం ఇవ్వనందుకే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆందోళనకు దిగారు. సమాచారం అందకున్న పోలీసులు నిరసనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమించజేశారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం బదాయు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు దహన సంస్కాల సమయంలో యువతి కళ్లను తొలగించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి.. మృతదేహంతో సహా ఆస్పత్రికి వెళ్లి ఆందోళకు దిగారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది మానవ అవయవాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మేజిస్ట్రేట్‌ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అవయవాలు దొంగిలించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మేజిస్ట్రేట్‌ హెచ్చరించారు.

Next Story