స్వర్ణ వాగులో యువకుడి మృతదేహం లభ్యం

by Chintha Aamani |

సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన మేకల

స్వర్ణ వాగులో యువకుడి మృతదేహం లభ్యం
X

దిశ,సారంగాపూర్ : సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన మేకల దేవేందర్ (30) యువకుడు మంగళవారం ద్విచక్ర వాహనంపై నిర్మల్ కి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు తెలిపి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోగా కుటుంబ సభ్యులు ఆంతటా వెతుకుతుండగా అతని ద్విచక్ర వాహనం ఆలూర్ మరియు బోరిగాం గ్రామాల మధ్యలో గల కల్వెర్ట్ బ్రిడ్జి వద్ద కనిపించింది. తండ్రి దేవన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రోజున బ్రిడ్జి నుండి స్వర్ణ వాగు లో వెతికించగా అతని మృతదేహం లభించింది.

మృతుడు కల్వెర్ట్ బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తున్న సమయంలో నీటి ప్రవాహంలో ప్రమాదావశాత్తు పడి ఈత రాక నీటిలో మునిగి చనిపోయి ఉంటాడని అతని కుటుంబ సభ్యుల వివరణ మేరకు దర్యాప్తు చేయడం జరిగిందని సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృత దేహమును నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. మృతుని భార్య శిరీష ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Next Story