- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్
బైక్‌పై అతివేగంగా వెళుతూ.. ట్రాన్స్‌ఫార్మన్‌ను ఢీకొట్టగా ముగ్గురు విద్యార్థులు దుర్మణం పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్ : బైక్‌పై అతివేగంగా వెళుతూ.. ట్రాన్స్‌ఫార్మన్‌ను ఢీకొట్టగా ముగ్గురు విద్యార్థులు దుర్మణం పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు శనివారం రాత్రి మాధవరం హైస్కూల్ సమీపంలోని గ్రౌండ్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగిన పార్టీలో వారు విపరీతంగా మద్యం సేవించి వారి వారి ఇళ్లకు అర్ధరాత్రి ఒంటి గంట సమయాంలో ఒకే బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ మిలటరీ మాధవరం వద్దకు రాగానే బైక్ అతివేగంతో అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు విద్యార్థులు స్పాట్‌లోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన వెంటనే తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు ఎటువంటి ఇవ్వకపోవడం గమనార్హం.






