- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..
by Batti.Sumithra |
అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, మిరుదొడ్డి : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. తొగుట ఎస్సై రవి కాంతారావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దొమ్మాట స్వామి (32) గత ఐదు సంవత్సరాలుగా పెద్దమాతర మల్లయ్య వద్ద మూడు ఎకరాల వ్యవసాయ పొలము కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
కాగా పంటలు సరిగా పండనందున అప్పులు ఎక్కువై ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండే వారు. ఇదే క్రమంలో జీవితం పై విరక్తి చెంది తను కౌలు చేస్తున్న వ్యవసాయ పొలం వద్దే వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య దొమ్మాట లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






